మూగజీవాలను వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు పశుసంవర్ధకశాఖ అనేక కార్యక్రమాలు అమలుచేస్తోందని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో కలిసి జిల్లా పశు వైద్యాధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈనెల ఐదు నుంచి 22 వరకు నిర్వహించే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ పోస్టర్ విడుదల చేశారు.
ఏడాదికి రెండు సార్లు టీకాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. నూరు శాతం విజయవంతం చేయాలని కోరారు. పశువులకు టీకాల వేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. తొలకరి వర్షాలతో వ్యాధులు త్వరగా విజృంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని తలసాని ఆదేశించారు.
ఇవీ చూడండి: అటవీ శాఖ మంత్రిని కలిసిన ఐకాస ప్రతినిధులు