ETV Bharat / briefs

కల్తీ పాలకు చెక్... ఫలిస్తున్న ప్రయోగాలు

పాలు... చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు అందరికి అవసరమే. ఆహ్లదం కోసం ఓ టీ, కాఫీ తాగాలన్నా పాలు తప్పనిసరి. నిత్యవసర వస్తువైన పాల స్వచ్ఛత ప్రశ్నార్థకమే. అక్రమార్కులు కలుషితం చేస్తున్నారు. కల్తీ పాలపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు చేసిన ప్రయోగాలు ఫలించాయి. కల్తీకి అడ్డుకట్ట వేసే రోజులు అతిత్వరలో రానున్నాయి.

milk
author img

By

Published : Jun 1, 2019, 10:49 AM IST

కల్తీ పాలకు చెక్

కల్తీ పాల వల్ల చిన్నారుల అనారోగ్యం పాలవడం ఐఐటీ హైదరాబాద్​లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సహాయ ఆచార్యుడు శివగోవింద్ సింగ్​ను కదిలించింది. పరిశోధక విద్యార్థి సురేష్ కుమార్ త్రిపాఠితో కలిసి 40 రకాలుగా పాలను కలుషితం చేస్తున్నట్లుగా కనుగోన్నారు. ఒక్కో రకమైన కాలుష్య కారకానికి ఒక్కో రకమైన పరీక్ష చేయాలి. ఇవి సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి. ప్రతి ఒక్కరికీ అందుబాటులో అతి తక్కువ ధరలో, సులువుగా గుర్తించేలా పరికరం తయారు చేయడానికి ప్రయోగాలు ప్రారంభించారు.

పాలలోని ఎలక్ట్రికల్ కండక్టవిటీ, పీహెచ్ స్థాయితో పాటు మరో రెండు ప్రధాన లక్షణాల్లో వచ్చే మార్పుల ద్వారా ఎంత కల్తీ అయ్యాయో గుర్తించేలా బయోచిప్ ఆధారంగా పరికరాన్ని రూపొందించారు. గణాంకాలతో సహా తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోనులో చూసుకునే విధంగా ప్రత్యేక యాప్​నూ అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే సాకేంతికంగా విజయం సాధించిన వీరి పరిశోధన.. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు రూపొందించిన పరికరం అందుబాటులోకి వస్తే.. పాల స్వచ్ఛతను చిటికెలో కనిపెట్టవచ్చు. ధర కేవలం రూ.1,500 లోపు ఉండనుంది.

ఇదీ చూడండి: పాలనా వ్యవస్థకు కీలకం కానున్న జూన్​ మాసం

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.