ETV Bharat / briefs

నేటి నుంచి అందుబాటులోకి మీరాలం పార్కు

నేటి నుంచి భాగ్యనగర ప్రజలకు మీరాలం చెరువు పార్కు అందుబాటులోకి రానుంది. సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి ప్రారంభించనున్నారు.

మీరాలం చెరువు పార్కు
author img

By

Published : Mar 23, 2019, 8:04 AM IST

Updated : Mar 23, 2019, 3:03 PM IST

నేటి నుంచి హైదరాబాద్​లో మరో సుందరమైన పార్కు ప్రజలకు అందుబాటులోకి రానుంది. రూ. 2.51 కోట్లతో నిర్మించిన మీరాలం ట్యాంక్ చెరువు పార్కును ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి ప్రారంభించనున్నారు. గ్రేటర్​ పరిధిలోని జోన్​కు రెండు మేజర్ పార్కుల చొప్పున అభివృద్ధి పనులను వేగవంతం చేసింది జీహెచ్​ఎంసీ.

హైదరాబాద్ - బెంగళూరు రహదారి మధ్యలోని మీరాలం ట్యాంక్ సరస్సు రెండో అతిపెద్ద పార్కుగా రూపొందింది. ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ బ‌యోడైవ‌ర్సిటీ విభాగం ద్వారా పనులు చేస్తున్నారు. 6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌ను 8 మీట‌ర్ల వెడ‌ల్పుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ఆకట్టుకునేలా...

మీరాలం ట్యాంక్‌లో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వ‌స్తువులు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఆద‌ర‌ణ ఉన్న ప‌చ్చీస్​, చెస్ ఆటల మాదిరి న‌మూనాల‌ను రూపొందించారు. పెద్ద ఎత్తున పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలు, చెత్తను పూర్తిగా తొల‌గించి పార్కు చుట్టూ మొక్కలు నాటారు. జీహెచ్ఎంసీ చెరువుల విభాగం ద్వారా మీరాలం చెరువు క‌ట్ట ప‌టిష్ఠత, కంచె ఏర్పాటు, పాత్‌-వే, లైటింగ్‌, పచ్చదనం ప‌నుల‌ను చేప‌ట్టారు. పార్కు ప్రవేశ ద్వారంలో వివిధ చిత్రాలతో కూడిన ఎంట్రీ ప్లాజా ప్రతి ఒక్కరిని ఆక‌ట్టుకునే విధంగా ఉంది.

ఇదీ చరిత్ర..

హుస్సేన్​సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణం కాకముందు నుంచే నగరవాసులకు మీరాలం ట్యాంక్ తాగునీరు అందించేది. హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ప్రధాన మంత్రిగా వ్యవహరించిన మీర్ ఆలం బహదూర్ 1804లో ఈ సరస్సు నిర్మించారు. టిప్పు సుల్తాన్​పై యుద్ధం చేయడానికి మీరాలం బలగాలని పంపారు. సమరంలో గెలిచిన తర్వాత​ మీరాలం శ్రీరంగపట్నం నుంచి తీసుకున్న ఖజానాతో ఈ సరస్సుని కట్టారని ప్రతీతి.

మీరాలం చెరువు పార్కు

ఇవీ చూడండి:"నిన్న పాఠశాల ఉన్నా నా కూతురు దక్కేది"

Last Updated : Mar 23, 2019, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.