దిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్యాపిటల్స్ ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించింది. పృథ్వీ షా మొదట్లో ధాటిగా ఆడి 16 బంతుల్లో 24 పరుగుల చేశాక అవుటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18)ను తాహిర్ పెవిలియన్‌కు పంపాడు. పంత్ (25) కాసేపు బ్యాట్‌కి పనిచెప్పాడు. ఆ తర్వాత బ్రావో బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి వెనుదిరిగాడు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) March 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Clinical bowling from @ChennaiIPL restrict @DelhiCapitals to a total of 147/6 in 20 overs. In how many overs do you reckon will #CSK attain the target? #VIVOIPL #DCvCSK pic.twitter.com/YRSWzBudFf
">Innings Break!
— IndianPremierLeague (@IPL) March 26, 2019
Clinical bowling from @ChennaiIPL restrict @DelhiCapitals to a total of 147/6 in 20 overs. In how many overs do you reckon will #CSK attain the target? #VIVOIPL #DCvCSK pic.twitter.com/YRSWzBudFfInnings Break!
— IndianPremierLeague (@IPL) March 26, 2019
Clinical bowling from @ChennaiIPL restrict @DelhiCapitals to a total of 147/6 in 20 overs. In how many overs do you reckon will #CSK attain the target? #VIVOIPL #DCvCSK pic.twitter.com/YRSWzBudFf
మెరిసిన ధావన్
ఓ వైపు వికెట్లు పడుతున్నా ధావన్ మాత్రం నెమ్మదిగా ఆడాడు. ముంబయి మ్యాచ్‌లో 43 పరుగులతో ఆకట్టుకున్న ధావన్ ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అనంతరం భారీ షాట్ ఆడబోయి బ్రావో బౌలింగ్ అవుటయ్యాడు.
చెన్నై బౌలర్లు భళా
పరుగులను కట్టడి చేస్తూ దిల్లీ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచి వికెట్లు సాధించారు చెన్నై బౌలర్లు. వారి ధాటికి వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు దిల్లీ బ్యాట్స్‌మెన్. బ్రావో 3 వికెట్లు సాధించగా, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, తాహిర్ చెరో వికెట్ తీశారు.