జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్‌తో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పాఠశాల ఏర్పాటు కావటం వల్ల కర్నూల్ వెళ్లే పరిస్థితి ఇక లేదని పేర్కొన్నారు. గతంలో అక్కడ చదువుకోవడం వల్ల స్థానికత సమస్య ఉత్పన్నమయ్యేదని వెల్లడించారు.
ఇవీ చూడండి: పాలమూరు విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు