ప్రయాణికులు కొంత మంది ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా... రైల్వేశాఖ స్పందించింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున వెనువెంటనే చర్యలకు ఉపక్రమించింది.
టీ కప్పులపై చౌకీదార్ నినాదం ముద్రణకు ఐఆర్సీటీసీ అనుమతి లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకు బాధ్యుడైన గుత్తేదారుకు రూ. లక్ష జరిమానా విధించింది. షోకాజ్ నోటీసు జారీ చేసింది.
రెండోసారి..
కొద్ది రోజుల క్రితం రైల్వేశాఖ టికెట్లపై ప్రధాని మోదీ చిత్రాన్ని ముద్రించడం వివాదాస్పదమైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ తప్పు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని రైల్వేశాఖ వివరణిచ్చింది.
- ఇదీ చూడండి:సుమిత్రా మహాజన్‌కు భాజపా సీటిస్తుందా?