ETV Bharat / briefs

లండన్​ కోర్టులో నీరవ్​కు రెండోసారి భంగపాటు

నీరవ్ మోదీ రెండో బెయిల్ పిటిషన్​ను లండన్​లోని న్యాయస్థానం తిరస్కరించింది. మనీ లాండరింగ్​ కేసులో సాక్షులను నీరవ్​ ప్రభావితం చేసే అవకాశం ఉందని భారత్ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ తీర్పునిచ్చింది. తదుపరి వాదనలు ఏప్రిల్ 26న వింటామని తెలిపింది.

నీరవ్ రెండో బెయిల్ అభ్యర్థన తిరస్కరణ
author img

By

Published : Mar 29, 2019, 9:10 PM IST

Updated : Mar 30, 2019, 12:04 AM IST

వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ రెండో బెయిల్ పిటిషన్​ను లండన్​లోని వెస్ట్​మినిస్టర్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం తిరస్కరించింది. ఆర్థిక నేరం కేసులో నీరవ్ లొంగిపోయేందుకు సుముఖంగా లేరని భారత్ తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దక్షిణ పసిఫిక్ సముద్ర ద్వీపకల్ప దేశం వనౌటు జాతీయ పౌరసత్వం కోసం నీరవ్ ప్రయత్నించిన వివరాలను పొందుపరిచారు.

నీరవ్​ భారత్​కు వెళ్లేందుకు సిద్ధంగా లేరనేందుకు బలమైన ఆధారాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. రెండో బెయిల్​ పిటిషన్​ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. తదుపరి వాదనలు ఏప్రిల్ 26కు వాయిదా వేసింది.

తదుపరి వాదనల సమయంలో నీరవ్​ను జైలు నుంచే దూరదృశ్య మార్గం ద్వారా విచారిస్తారు.

రూ.14వేల కోట్ల పంజాబ్​ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ.

మనీలాండరింగ్ కేసులో సాక్షులను నీరవ్​ మోదీ బెదిరిస్తున్నారని భారత్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఆశిశ్ లాడ్​ను చంపేస్తానని ఫోన్లో భయభ్రాంతులకు గురి చేసి, కోర్టులో తప్పుడు స్టేట్​మెంట్ ఇస్తే 2 మిలియన్ డాలర్లు ఇస్తానని నీరవ్ మోదీ ఆశ చూపారని కోర్టుకు వివరించారు న్యాయవాది.

ఈడీ కార్యాలయంలో వివాదాస్పద పరిణామాలు

ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం వివాదాస్పద పరిణామాలు జరిగాయి. నీరవ్ మోదీ మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ​ జాయింట్​ డైరెక్టర్​ సత్యబ్రాత్ కుమార్​ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈడీ. తిరిగి కొద్ది సేపటికే ఆ ఆదేశాలను రద్దు చేసింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cobham, England, UK - 29th March 2019.
1. 00:00 SOUNDBITE (English): Maurizio Sarri, Chelsea head coach:
(asked what Callum Hudson-Odoi needs to do to start for Chelsea in the Premier League)
"It's not a problem for me to put him in the starting eleven in a Premier League match. He's ready, but of course I can play only with two wingers. So in the squad we have (Eden) Hazard, Willian, Pedro, so it's not really very easy to start in every match here. Probably in the near future he will start in 75, 80 percent of the matches."
2. 00:40 SOUNDBITE (English): Maurizio Sarri, Chelsea head coach:
(Q. You've said in the past we put too much pressure on young English players so this probably hasn't helped your cause has it?)
"He is doing very well, but he needs to improve more because the potential is really very high, and so I don't want him to stop to improve because he can become I think one of the most important players in Europe, but he needs to improve more."
SOURCE: Premier League Productions
DURATION: 01:10
STORYLINE:
++ TO FOLLOW ++
Last Updated : Mar 30, 2019, 12:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.