ETV Bharat / briefs

రాష్ట్రానికి 5 గిగావాట్ల లియాన్​ బ్యాటరీ ప్లాంట్​ - lion battery

రాష్ట్రానికి గిగాస్కేల్ లియాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ రానుంది. ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అన్నివసతులు కల్పిస్తామని సీఎస్ ఎస్కే జోషి తెలిపారు.

రాష్ట్రానికి 5 గిగావాట్ల లియాన్​ బ్యాటరీ ప్లాంట్​
author img

By

Published : Jun 7, 2019, 3:17 PM IST

రాష్ట్రంలో 5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన లియాన్​ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ అనుకూల ప్రాంతమని సీఎస్​ ఎస్కేజోషి అన్నారు. నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఇవాళ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో ప్లాంట్​ ఏర్పాటుకు రాష్ట్ర సన్నద్ధతను సీఎస్ తెలిపారు. టీఎస్ ఐపాస్ సహా రాష్ట్రంలో ఉత్తమ విధానాలు, ప్రోత్సాహకాల వల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చాయని వివరించారు. బ్యాటరీ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు బాహ్యవలయ రహదారి, విమానాశ్రయ సమీపంలో 200 ఎకరాల భూమి ఉందని, విద్యుత్, నీటి రాయితీలు ఇస్తామని జోషి తెలిపారు. నైపుణ్యం కలిగిన మానవవనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. 2023 నాటికి దేశంలోని అన్ని మూడు చక్రాల వాహనాలు, 2025 నాటికి అన్ని ద్విచక్ర వాహనాలను ఎలక్ట్రిక్ విధానంలోకి మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. కేంద్ర ప్రయత్నాలకు రాష్ట్రాలు సహకరించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి: 'సరళతర వాణిజ్య సంస్కరణలు వేగవంతం చేయాలి'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.