మలింగ.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు సుపరిచితమే. శ్రీలంక క్రికెటర్‌గానే కాకుండా.. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ పేసర్‌గా ఎన్నో ఘనతలు సాధించాడు. ఇప్పుడు కొద్ది సమయంలోనే రెండు మ్యాచ్‌లాడి మరోసారి వార్తల్లో నిలిచాడు. రిటైర్మెంట్కు దగ్గరపడుతున్న ఈ క్రికెటర్.. ఆటంటే ఎంత ఇష్టమో నిరూపించాడు.
బుధవారం.. వాంఖడే స్టేడియంలో చెన్నైతో ఆడిన మ్యాచ్‌లో ముంబయి తరఫున 3 వికెట్లు తీశాడు మలింగ. అనంతరం విమానమెక్కి శ్రీలంకలో జరుగుతున్న దేశవాళీ లీగ్‌లో పాల్గొన్నాడు. గాలె తరఫున 7 వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. కేవలం 12 గంటల వ్యవధిలోనే రెండు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడీ బౌలర్.
-
Loving the commitment and your hat, Mali 🙌🏻
— Mumbai Indians (@mipaltan) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
In less than 12 hours, Malinga has gone from being vital in a win for us in Mumbai to leading Galle in Sri Lanka’s #SuperProvincial 50-over tournament.
Can’t wait to have you back, champ 💙#OneFamily #CricketMeriJaan #MumbaiIndians pic.twitter.com/GCDg5PQh36
">Loving the commitment and your hat, Mali 🙌🏻
— Mumbai Indians (@mipaltan) April 4, 2019
In less than 12 hours, Malinga has gone from being vital in a win for us in Mumbai to leading Galle in Sri Lanka’s #SuperProvincial 50-over tournament.
Can’t wait to have you back, champ 💙#OneFamily #CricketMeriJaan #MumbaiIndians pic.twitter.com/GCDg5PQh36Loving the commitment and your hat, Mali 🙌🏻
— Mumbai Indians (@mipaltan) April 4, 2019
In less than 12 hours, Malinga has gone from being vital in a win for us in Mumbai to leading Galle in Sri Lanka’s #SuperProvincial 50-over tournament.
Can’t wait to have you back, champ 💙#OneFamily #CricketMeriJaan #MumbaiIndians pic.twitter.com/GCDg5PQh36
ప్రపంచకప్ జట్టులో ఉండాలంటే దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలనే నిబంధన విధించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ కారణంగానే మలింగ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసిన ముంబయి ఇండియన్స్.. అతనిపై ప్రశంసలు కురిపించింది. జాతీయ జట్టుకు ఆడాల్సి రావడంతో.. ఐపీఎల్ మధ్యలోనే వెనుదిరిగాడు లసిత్ మలింగ.
ఇవీ చదవండి: