సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తెరాస 14 నుంచి 16 సీట్లు కైవసం చేసుకుంటుందని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సున్నా నుంచి 2 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. ఇక ఎంఐఎం పోటీ చేసిన ఒక సీటు గెలుపొందుతుందని తెలిపారు.
ఏపీలో సైకిల్ హవా
ఏపీలో తెదేపా తిరిగి అధికారంలోకి రాబోతుందని లగడపాటి సర్వే వివరాలను వెల్లడించారు. వంద స్థానాలకు 10 అటు ఇటుగా తెదేపా గెలుస్తుందని ప్రకటించారు. వైకాపాకు 7 అటు ఇటుగా 72 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. జనసేన, ఇతరులకు 3 స్థానాలు రావొచ్చన్నారు. వైకాపా గట్టి పోటీనే ఇచ్చినా... పవన్ జనసేన పార్టీ రాకతో త్రిముఖ పోటీ జరిగిందన్నారు లగడపాటి.
లోక్సభ స్థానాలకొస్తే తెదేపా 15 స్థానాలకు 2 సీట్లు అటు ఇటుగా.. వైసీపీ 10 స్థానాలకు 2 సీట్లు అటు ఇటుగా... జనసేన ఒక స్థానం వస్తే రావొచ్చు... లేదంటే రాకపోవచ్చని తెలిపారు.