ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్-కోల్‌కతా మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇప్పుడు రెండు విజయంపై కన్నేశాయి.
.@ashwinravi99 calls it right at the toss and elects to bowl first at the Eden Gardens.
— IndianPremierLeague (@IPL) March 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/CWrUFs8ri3 #VIVOIPL pic.twitter.com/DgwowsQHMW
">.@ashwinravi99 calls it right at the toss and elects to bowl first at the Eden Gardens.
— IndianPremierLeague (@IPL) March 27, 2019
Live - https://t.co/CWrUFs8ri3 #VIVOIPL pic.twitter.com/DgwowsQHMW.@ashwinravi99 calls it right at the toss and elects to bowl first at the Eden Gardens.
— IndianPremierLeague (@IPL) March 27, 2019
Live - https://t.co/CWrUFs8ri3 #VIVOIPL pic.twitter.com/DgwowsQHMW
2017 నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన అన్ని ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌నే ఎంచుకోవడం విశేషం.
కింగ్స్ జట్టులో క్రిస్ గేల్ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత మ్యాచ్‌లో యువ క్రికెటర్ సర్ఫరాజ్ 47 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కోల్‌కతా జట్టులో రసెల్ చేలరేగి ఆడి మొదటి మ్యాచ్‌లో విజయాన్ని తెచ్చిపెట్టాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే తరహాలో చెలరేగాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. యువ బ్యాట్స్‌మెన్ నితీశ్ రానా అర్ధ శతకంతో రాణించాడు.
దిల్లీతో జరిగిన తన తొలి మ్యాచ్‌లో 'మన్కడింగ్' చేసిన పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్ విమర్శలు ఎదుర్కొన్నాడు.
జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్
దినేశ్ కార్తీక్(కెప్టెన్), రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, శుభ్‌మన్ గిల్, ఆండ్రి రసెల్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, నితీశ్ రానా, ప్రసిధ్ కృష్ణ, ల్యూకీ ఫెర్గుసన్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), సామ్ కరన్, మహమ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్‌గేల్, కే ఎల్ రాహుల్, అంకిత్ రాజ్‌పుత్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ముజీబుర్ రెహమాన్, డేవిడ్ మిల్లర్