ఖనిజాన్వేషణకు నిర్వహించే కోర్ డ్రిల్లింగ్కు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో మరోసారి అనుమతులు జారీ అయ్యాయి. దీనిలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ నుంచి ఆళ్లగడ్డ, నంద్యాల, రుద్రవరం, ఆత్మకూరు మండలాల తహసీల్దార్లకు గత నెల23న ఆదేశాలందాయి. వీటిని 'ఈటీవీ భారత్' సోమవారం సంపాదించింది.
ఆళ్లగడ్డ, నంద్యాల, రుద్రవరం మండలాల పరిధిలో యురేనియం ఖనిజాన్వేషణకు కోర్ డ్రిల్లింగు... నంద్యాల, ఆళ్లగడ్డ, నియోజవర్గ పరిధిలో సమగ్ర సర్వే, భౌగోళిక మ్యాపింగ్ నిర్వహించనున్నారని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు, వెంకటాపురం, నారాయణపురం, పరిధిలో పర్యవేక్షణతో కూడిన సర్వే, భౌగోళిక మ్యాపింగ్ నిర్వహించనున్నారు. యురేనియం తవ్వకాలపై ఇప్పటికే జిల్లాలో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా మళ్లీ ఆదేశాలు రావటంతో గ్రామీణులు భయపడుతున్నారు.
ఇదీ చదవండి: ఆరోగ్య పథకానికీ.. అవినీతి రోగం