నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లి విషజ్వరాలతో వణికిపోతోంది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు జ్వరం కారణంగా మృతి చెందడం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. నాలుగేళ్ల చిన్నారి సౌమ్య, పదకొండేళ్ల అబ్బాయి ప్రణయ్ విషజ్వరంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో వైద్య బృందం పర్యటించి 39 మంది రక్త నమూనాలను జిల్లా కేంద్రానికి తరలించారు. మలేరియా సోకి చనిపోయారా లేక ఇంకా ఏదైనా వ్యాధితో మరణించారా అన్నది వైద్యులు తేల్చాల్సిందిగా గ్రామస్థులు కోరుతున్నారు. కొంత మంది తమ పిల్లలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు అధికారులు.
ఇవీ చూడండి: కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు శంకుస్థాపన