అధికారంలోకి వస్తే ఏడాదిలోపు బస్ డిపో, ఐటీ కంపెనీలు, ఆలేరు వరకు ఎంఎంటీఎస్ రైలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
'అతను మాత్రం చెల్లని రూపాయి కాదా' - MMTS TRAIN
హుజూర్ నగర్ నుంచి ఓడిపోయిన మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం చెల్లని రూపాయి కాదా.. అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. బూర నర్సయ్య గౌడ్‌కు ప్రజల సమస్యల పట్ల అవగాహన లేదని భువనగిరి రోడ్‌షోలో విమర్శించారు.
ప్రచారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి
భువనగిరి తెరాస ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు రైతులు, విద్యార్థుల సమస్యల పట్ల కనీస అవగాహన లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన నిమ్స్ రాకుండా అడ్డుకున్నారన్నారు. నిమ్స్ వస్తే తన ఆస్పత్రి మూతపడుతుందన్న భయంతోనే ఇలా చేశారని ఆరోపించారు. పోరాటాల చరిత్ర ఉన్న భువనగిరి ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నానని ఎన్నికల ప్రచారంలో హస్తం పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెరాస వాళ్లు తనను చెల్లని రూపాయి అన్నారని.. హుజూర్ నగర్ నుంచి ఓడిన మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం చెల్లని రూపాయి కాదా.. అని ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వస్తే ఏడాదిలోపు బస్ డిపో, ఐటీ కంపెనీలు, ఆలేరు వరకు ఎంఎంటీఎస్ రైలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Last Updated : Apr 2, 2019, 7:25 AM IST