భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజయం సాధించకపోయినా... తెరాస 16 సీట్లు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. తమ గురించి మాట్లాడేముందు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని బూర నర్సయ్యను హెచ్చరించారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసి... సోనియాతో కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చిన మాపై విమర్శలు చేయడం విడ్డూరమని దుయ్యబట్టారు.
తన పదవీ కాలంలో భువనగిరి, ఆలేరు, జనగామ రైల్వేస్టేషన్లను మోడల్ స్టేషన్లుగా మార్చానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి తెచ్చి ప్రజలని ఇబ్బందులకు గురి చేశారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. కేసీఆర్కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనన్నారు. రాబోయే రోజుల్లో తెరాస నాలుగు ముక్కలవుతుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:కోరికలు తీర్చే చిత్రగుప్తుడు.. హైదరాబాద్లో కొలువుదీరిండు