ఇంటర్మీడియట్ ఫలితాల నిర్వహణలో ఇంటర్ బోర్డు వైఫల్యం చెందిందని మండిపడ్డారు భాజపా నేత కిషన్‌రెడ్డి. 26 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆయన ధ్వజమెత్తారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండ్రోనిపల్లి గ్రామంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్ల శిరీష అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పపడింది. బాధిత కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ నేత కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు భాజపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అధికారులు, మంత్రులు చలించలేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు జితేందర్‌రెడ్డి, నాగూరావు నామాజీ, రతన్ పాన్రెడ్డి, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: చరిత్ర సృష్టించిన రెఫరెండం ఎంపీటీసీ