కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వగ్రామానికి వెళ్ళిన గంగాపురం కిషన్ రెడ్డికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌కు తన సతీమణితో కలిసి వెళ్ళారు. గ్రామంలోని రామాలయంలో కిషన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తల్లిదండ్రుల సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. అక్కడ నుంచి తన ఇంటికి వెళ్లి గ్రామస్థులతో ముచ్చటించారు. అనంతరం కిషన్ రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు.
ఇవీ చూడండి: '3 లక్షల టన్నుల మైలురాయి దాటేశాం'