ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయానికై ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్నిధి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో ఈ నెల 24నే ప్రారంభించనున్నారు. ఫర్టిలైజర్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి 'కిసాన్ మహా అధివేశన్'గా నామకరణం చేశారు.
తొలివిడత సాయంగా రూ. 2 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు భాజపా రాష్ట్రాధ్యక్షుడు సత్యేంద్ర సిన్హా. ఏడువేలమంది రైతులు ఈ సభలో పాల్గొననున్నారని అంచనా.
ప్రతిపక్ష నాయకుల ఎద్దేవా...
2016లో ఫర్టిలైజర్ మైదానం లోనే ఎయిమ్స్‌కు, ఫర్టిలైజర్ ఫాక్టరీకి శంకుస్థాపన చేశారని ఇప్పటి వరకూ నిర్మాణానికి నోచుకోలేదని విమర్శిస్తున్నాయి విపక్షాలు. ప్రస్తుతం పెట్టుబడి సాయానికి నాంది పలుకుతున్నారని ఈ పథకాన్ని అలాగే మట్టిపాలు చేస్తారని సమాజ్‌వాదీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.