చెరువులు నింపాలే..
కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్ జలాశయాలు, కాలువలు, సొరంగాల పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీరందేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సాగునీటి సమర్థ వినియోగానికి ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. గోదావరి జలాలు ఎత్తిపోసి చెరువులు నింపాలన్నారు. వర్షాకాలంలో చెరువులన్నీ నింపేలా కాలువలకు తూములు నిర్మించాలి పేర్కొన్నారు.
ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యయం చేస్తోందని కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు నీరు, వర్షం నీళ్లు అన్నీ చెరువులకు మళ్లేలా కాల్వలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున నిర్మించిన చెక్ డ్యాముల్లో కూడా నీరు నిల్వ ఉండేలా చూడాలన్నారు.
ఇవీ చూడండి:నాయనమ్మ చెప్పిందే మళ్లీ చెప్తున్నడు: కేటీఆర్