ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన దాదాపు గంటసేపు గవర్నర్‌తో సమావేశమయ్యారు. నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో సమావేశమైన నేపథ్యంలో... ఇవాళ కేసీఆర్ మళ్లీ గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది. నిన్నటి సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన కొన్ని అంశాలు, ప్రత్యేకించి విభజన అంశాలపై ఇవాళ చర్చ జరిగినట్లు సమాచారం. ఇతర పాలనా పరమైన అంశాలు కూడా ఇరువురి భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: అభివృద్ధి చేశాం.. ఇంకా చేసి చూపిస్తాం..