ETV Bharat / briefs

ఒకే విమానంలో గవర్నర్​, కేసీఆర్​, జగన్​ - MODI

మోదీ ప్రమాణ స్వీకారానికి గవర్నర్​, సీఎం కేసీఆర్​, వైకాపా అధినేత జగన్​లు ఒకే విమానంలో వెళ్లనున్నట్లు సమాచారం. ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి దిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.

గవర్నర్​, కేసీఆర్​, జగన్​
author img

By

Published : May 28, 2019, 10:37 AM IST

Updated : May 28, 2019, 3:41 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి గవర్నర్​ నరసింహన్​తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​, వైకాపా అధినేత జగన్​మోహన్​ రెడ్డిలు ఒకే విమానంలో విజయవాడ నుంచి దిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్​ హస్తినకు వెళ్లడంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. దీనిపై మరికొద్ది గంటల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ నెల 30న రాత్రి ఏడు గంటలకు మోదీ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నరసింహన్​, కేసీఆర్​, జగన్​లకు ఆహ్వానం అందింది.

మే 30న మధ్యాహ్నం అమరావతిలో ఏపీ సీఎంగా జగన్​ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి నరసింహన్​, కేసీఆర్​లు హాజరవుతున్నారు. ప్రమాణం అనంతరం గవర్నర్​, జగన్​లు కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేసీఆర్​ కూడా వెళ్లాలనుకుంటే ముగ్గురూ ఒకే విమానంలో వెళ్లే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి గవర్నర్​ నరసింహన్​తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​, వైకాపా అధినేత జగన్​మోహన్​ రెడ్డిలు ఒకే విమానంలో విజయవాడ నుంచి దిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్​ హస్తినకు వెళ్లడంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. దీనిపై మరికొద్ది గంటల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ నెల 30న రాత్రి ఏడు గంటలకు మోదీ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నరసింహన్​, కేసీఆర్​, జగన్​లకు ఆహ్వానం అందింది.

మే 30న మధ్యాహ్నం అమరావతిలో ఏపీ సీఎంగా జగన్​ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి నరసింహన్​, కేసీఆర్​లు హాజరవుతున్నారు. ప్రమాణం అనంతరం గవర్నర్​, జగన్​లు కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేసీఆర్​ కూడా వెళ్లాలనుకుంటే ముగ్గురూ ఒకే విమానంలో వెళ్లే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: పరోక్ష ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో కొత్త సెక్షన్

Intro:TG_Mbnr_01_28_Medical_Tests_For_Gurukula_Students_PKG_C4

( ) విద్యార్థులకు... ఉద్యోగులకు ఆరోగ్య పరంగా ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన పత్రాలే కొలమానంగా చూస్తారు. సాధారణంగా ఇలాంటి పరీక్షలు చేయాల్సి వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేస్తారు. కానీ.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధికారులు మాత్రం నిబంధనలకు పక్కన పెట్టారు. ప్రైవేటు ప్రయోగశాలలో వైద్య పరీక్షలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నివేదిక తీసుకువస్తే చెల్లవంటూ చెప్పిన అధికారులు.. ప్రైవేట్ నివేదికలపై ప్రభుత్వ అధికారులతో సంతకాలు చేయించడం గమనార్హం. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా భారం పడుతుంది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధికారులు తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


Body:ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఉద్యోగమైనా విద్యాలయాల్లో ప్రవేశం అయిన కచ్చితంగా ప్రభుత్వ సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి వైద్య ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. కానీ.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధికారులు మాత్రం వీటిని విస్మరించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గ్రూప్-1 నుంచి మొదలు పెడితే విద్యార్థులు అడ్మిషన్ కోసం పరీక్షలు చేసేందుకు వసతులు ఉన్నాయి. వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉన్నారు. కానీ.. అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ప్రధానోపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ప్రయోగశాల యజమాని పిలిపించి తక్కువ ధరకు చేయాలని చెప్పి బాధ్యతలను అప్పగించారు. కనీసం బహిరంగంగా ప్రకటన సైతం ఇవ్వకుండ ఒక్కరికే బాధ్యతలు అప్పగించారు. ఇకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి జారీ చేసిన ధ్రువపత్రాలను తీసుకుపోతే వాటిని తిరస్కరించి తిరిగి ప్రైవేట్ ప్రయోగశాలకే పంపిస్తున్నారు గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్లు. కేవలం వారు సూచించిన ప్రయోగశాలకు మాత్రమే వెళ్లాలని ఇతర వాటికి వెళ్లిన తీసుకోబోమని స్పష్టం చేస్తున్నారు. కానీ ప్రైవేటు ప్రయోగశాలలో, ప్రైవేటు వైద్యులు ఇచ్చిన నివేదికలపై మాత్రం ప్రభుత్వ వైద్యులు సంతకం ఉండాలని సూచించారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.


Conclusion:సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అధికారులు తీసుకున్న నిర్ణయాలు విద్యార్థులు తల్లిదండ్రులకు ఆర్థికంగా భారంగా మారాయి. ప్రైవేట్ ప్రయోగశాలలో చేస్తున్న పరీక్షలకు 1780 రూపాయలు అవుతుందని బిల్లు ఇచ్చి.. ఇందులో 980 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నామని, ఎనిమిది వందల రూపాయలు చెల్లించాలని రశీదులు ఇస్తున్నారు. ఇక దంత సంబంధిత పరీక్షలకు 50... కంటికి సంబంధించిన పరీక్షలకు మరో 100 రూపాయలు తీసుకుంటున్నారు. రక్త పరీక్షలు ప్రయోగశాలల్లో సాగినప్పటికీ దంత, కంటి పరీక్షలకు వేరువేరు వైద్యుల వద్దకు వెళ్లాలి. ఇక వీటన్నిటిపై సంతకం కోసం ప్రభుత్వ వైద్యుడి వద్దకు వెళ్లాల్సి వస్తోంది.

Vo. సీటు సాధించుకున్న గురుకులాల్లో విద్యార్థులను చేర్పించేందుకు వస్తే ఆరోగ్య పరీక్షల ధ్రువపత్రాలు కావాలని కోరుతున్నారని... తీరా తమకు అందుబాటులో ఉన్నా.. వనపర్తి, షాద్ నగర్, జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకువస్తే చెల్లవంటూ ప్రైవేటు ప్రయోగశాల పేరు రాసి ఫారంతో పాటు అందించారని బాధితులు వాపోతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి పరీక్షల కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంకు రావాల్సి ఉండడం తో తమకు ఆర్థిక భారం పడటం... పరీక్షలు పూర్తయ్యాక సంతకాల కోసం నాలుగు చోట్లకు తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు సూచించిన ప్రైవేటు ప్రయోగశాల ధ్రువపత్రాలు తీసుకువస్తేనే గురుకులాల్లో ప్రవేశాలకు అనుమతిస్తామని చెబుతున్నారని వాపోయారు.......bytes
బైట్స్
నర్సిములు, చిన్నరేవల్లి
ఆంజనేయులు, వనపర్తి
అలివేలు, కొల్లాపూర్


vo. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని గురుకులాల్లో సీట్లు సాధించిన విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ప్రవేశాలకు పరుగులు తీస్తున్నారు.
Last Updated : May 28, 2019, 3:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.