'ఇక్కడ 16 గెలిపిస్తే అక్కడ 116 వస్తాయి' - elections 2019
జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్లలో లోక్‌సభ తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత రోడ్‌షో నిర్వహించారు. తెలంగాణలో 16 సీట్లలో కారును గెలిపిస్తే దిల్లీలో కేసీఆర్ 116 చేస్తారని తెలిపారు.
పెంబట్ల రోడ్‌షోలో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి కవిత
తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో తెరాసను గెలిపిస్తే దిల్లీలో కేసీఆర్ 116 స్థానాలు సాధిస్తారని జగిత్యాల జిల్లా పెంబట్లలో జరిగిన రోడ్‌షోలో తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెంబట్లలోని రాజేశ్వర స్వామి ఆలయానికి రూ.90లక్షలు మంజూరు చేశారని... ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆ నిధులను కేటాయించలేదని... మే నెలలో అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని కవిత హామీ ఇచ్చారు.