మూడోసారి ప్రభాస్‌తో కలిసి నటించనుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. రాధాకృష్ణ దర్శకత్వంలో రెబల్ స్టార్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో అతిథి పాత్రలో కాజల్ కనిపించనుందని సమాచారం. ఇప్పటికే వీరద్దరూ కలిసి 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రాలతో అభిమానులను అలరించారు.
ప్రస్తుతం చిత్ర బృందం కాజల్‌తో చర్చలు జరుపుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని టాక్. పీరియాడికల్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాతో పాటు 'సాహో' చిత్రీకరణలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 15న విడుదల కానుంది.