క్రికెటర్ అర్జున్‌గా త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాడు హీరో నాని. కొత్త సినిమా 'జెర్సీ' కోసం పూర్తి స్థాయిలో క్రికెట్ శిక్షణ తీసుకున్నాడు. కోచ్ ఆధ్వర్యంలో సూమారు 70 రోజుల పాటు బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.
క్రికెటర్ రమణ్ లంబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. 36 ఏళ్ల రంజీ క్రికెటర్‌గా నాని కనిపించబోతున్నాడు. హీరోయిన్గా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ నటించింది. 'మళ్లీ రావా'తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
అనిరుధ్ రవిచందర్ సంగీతమందించాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 19 ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇవీ చదవండి: