తమపై కవ్వింపు చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాను హెచ్చరించింది ఇరాన్. తమవైపు ఒక్క బుల్లెట్ ప్రయోగించినా అమెరికా, మిత్రదేశాలు మూల్యం చెల్లించుకుంటాయని ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
తమ డ్రోన్‌ను కూల్చివేసినందుకు ఇరాన్‌పై దాడికి అమెరికా సర్వం సిద్ధం చేసుకొని, చివరి నిమిషంలో ఆలోచన విరమించుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తెలిపారు.
నిబంధనలు అతిక్రమించినందుకే అమెరికా డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ వివరణ ఇవ్వగా.. అమెరికా తోసిపుచ్చింది.
ఇరాక్‌లో అమెరికా బలగాలకు భద్రత కట్టుదిట్టం
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాక్‌లోని అగ్రరాజ్యం సైన్యానికి భద్రతను కట్టుదిట్టం చేశారు. తమ దేశంలో అతిపెద్ద ఎయిర్‌బేస్‌లో ఆశ్రయం పొందుతున్న అమెరికా శిక్షకులకు భద్రతా ప్రమాణాలు పెంచినట్లు ఇరాక్ సైన్యాధికారి ఫాలా తెలిపారు. గతవారమే ఈ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగింది.
ఇదీ చూడండి: ఇరాన్‌పై దాడికి సిద్ధమై మనసు మార్చుకున్న ట్రంప్!