రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కారణమైన ఇంటర్ ఫలితాల వ్యవహారంలో.. త్రిసభ్య కమిటీ రేపు ఉదయం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి నివేదిక సమర్పించనుంది. మూడు రోజులుగా సుదీర్ఘంగా విచారించిన కమిటీ గ్లోబరీనా సామర్థ్యం, టెండర్ల ప్రక్రియలో అనుసరించిన విధానం, ఇంటర్ బోర్డు పర్యవేక్షణ లోపం వంటి అంశాలపై నిశీత పరిశీలన చేసింది. వీటన్నింటిపై 12 పేజీల నివేదికతో పాటు, మరో 150 పేజీలతో కూడిన 12 అంశాలపై సుధీర్ఘ వివరణ ఇవ్వనుంది. గ్లోబరీనాతోపాటు ఇంటర్ బోర్డులోనూ లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది.
ఇవీ చూడండి: ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు గడువు పెంపు