ETV Bharat / briefs

ఆ వార్తలు అవాస్తవం: ఇంటర్​ బోర్డు - TELANGANA INTER MEDIATE

ఇంటర్​ మూల్యాంకనం విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని బోర్టు కార్యదర్శి అశోక్​ స్పష్టం చేశారు. ఏ విద్యార్థి వివరాలు గల్లంతుకాలేదని.. తమ వద్ద భద్రంగా ఉన్నాయని తెలిపారు.

ఆ వార్తలు అవాస్తవం: ఇంటర్​ బోర్డు
author img

By

Published : Apr 21, 2019, 10:34 PM IST

ఇంటర్మీడియట్​ పరీక్షలకు హాజరుకాని కొందరు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఇంటర్​ బోర్డు స్పష్టం చేసింది. 21 వేల మంది విద్యార్థుల వివరాలు గల్లంతయినట్లు కొందరు ప్రచారం చేయడాన్ని బోర్డు కార్యదర్శి అశోక్​ తప్పుపట్టారు. అందరి వివరాలు తమ వద్ద భద్రంగా ఉన్నాయని తెలిపారు. మూల్యాంకనం విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్ని అర్హతలు ఉన్నవారితోనే జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించామని బోర్డు కార్యదర్శి అశోక్​ పేర్కొన్నారు.

ఆ వార్తలు అవాస్తవం: ఇంటర్​ బోర్డు

ఇవీ చూడండి: ప్రశాతంగా ముగిసిన ఎస్సై అభ్యర్థుల రాత పరీక్ష

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.