ప్రఖ్యాత టైమ్ మేగజిన్ 'నెక్ట్స్ జనరేషన్ లీడర్-2019' పేరుతో అత్యంత ఆదరణ కల్గిన 10 మంది జాబితాను విడుదల చేసింది. భారత్‌కు చెందిన యూట్యూబ్ సంచలనం, 19 ఏళ్ల యువకుడు అజయ్ నగర్‌కు ఇందులో చోటు దక్కింది. 'క్యారీ మినాటి'గా సుపరిచుతుడైన అజయ్ యూట్యూబ్ ఛానల్‌కు 68లక్షల మందికిపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.
తన స్టైల్, హిందీ రచనలతో యూట్యూబ్‌లో అనతికాలంలో అత్యంత ఆదరణ పొందాడు అజయ్ నగర్. 10ఏళ్ల వయసులోనే తన మొదటి యూట్యూబ్ వీడియో పోస్టు చేశాడు.
టార్గెట్ 'నంబర్ 2'...
యూట్యూబ్‌లో అత్యధికంగా టీ-సిరీస్ మ్యూజిక్ కంపెనీ ఛానల్‌ను 9 కోట్ల 86లక్షల మందికిపైగా అనుసరిస్తున్నారు. ఆ తర్వాతి స్థానం ప్యూడైపైదే. అతడికి 9కోట్ల 50లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాంటి ప్యూడైపై మీద మాటల దాడితో అజయ్ రూపొందించిన వీడియో బాగా పాపులర్ అయింది. ఏదో ఒక రోజు భారతీయ యువకుడు ప్యూడైపై రికార్డును అధిగమిస్తాడని ఆ వీడియో సారాంశం.
టైమ్ జాబితాలో స్వీడన్‌కు చెందిన 16ఏళ్ల ఓల్డ్ గ్రెటా తన్బర్జ్కు స్థానం లభించింది. ఆమె వాతావరణ మార్పుపై గళమెత్తి శక్తిమంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందింది.
భారత్‌లో ఇలా...
యూట్యూబ్‌ను అత్యధికంగా అనుసరిస్తున్న వారున్న దేశాల జాబితాలో 2018లో అమెరికాను వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచింది భారత్. ప్రస్తుతం మన దేశం నుంచి 26.5కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ఇదీ చూడండి: భారతీయులకు మరింత సులభంగా గ్రీన్‌కార్డ్!