నేడు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. సాయంత్రం 6.53 గంటలకు జరిగే విందుకు సీఎంలను గవర్నర్ ఆహ్వానించగా.. వారు అంగీకరించారు. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్లో కేసీఆర్తో కలిసి పాల్గొనే మొదటి కార్యక్రమం ఇదే కానుంది!
విందు తర్వాత భేటీ!
ఇఫ్తార్ విందు ముగిసిన తర్వాత గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీకానున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, సచివాలయ భవనాలు, శాఖాధిపతుల కార్యాలయాలు అప్పగించే అంశాలపై చర్చించనున్నారు. తొమ్మిదో, పదో షెడ్యూలు సంస్థల విభజనను ఆర్నెళ్ల వ్యవధిలో పూర్తి చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటి కోసం ముందుగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఆంక్షలు పూర్తిగా తొలగించనున్నారు.
ఇవీ చూడండి: రహదారి ప్రమాద మరణాల్లో మనదే అగ్రస్థానం: డాక్టర్ కృష్ణయ్య