టెలివిజన్, ల్యాప్టాప్, కంప్యూటర్, సెల్ఫోన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పునకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్ర విభాగం ఆచార్యులు డాక్టర్ సురాజిత్ ధారా ఆధ్వర్యంలోని విద్యార్థుల బృందం నాలుగేళ్లపాటు శ్రమించి రబ్బింగ్ మిషన్ పరికరాన్ని తీర్చిదిద్దారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రబ్బింగ్ మిషన్ను ఆవిష్కరించారు. ఈ పరికరంతో విదేశాల్లో తయారయ్యే ఎల్సీడీల కంటే నాణ్యమైనవి తయారు చేయవచ్చని హెచ్సీయూ వీసీ అప్పారావు తెలిపారు. ఇవి అందుబాటులోకి వస్తే ఎల్సీడీల ధరలు 10 రేట్లు తగ్గుతాయని వెల్లడించారు. ప్రస్తుతం కేరళలోని హోల్ మార్క్ ఆప్టో మెకట్రోనిక్స్ సంస్థ సహకారంతో ప్రొటోటైప్ లో ఉన్న రబ్బింగ్ మిషన్ను మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఇదీ చూడండి : కేటీఆర్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం