ETV Bharat / briefs

తెలంగాణ సీఎం కేసీఆర్​కు హైకోర్టు నోటీసులు

గజ్వేల్​లో కేసీఆర్​ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్​ను హైకోర్టు స్వీకరించింది. అఫిడవిట్​లో కేసీఆర్​ సరైన వివరాలు సమర్పించలేదని శ్రీనివాస్​ అనే వ్యక్తి వ్యాజ్యం దాఖలు చేశారు. కేసీఆర్​తో పాటు ఈసీకి, మరో 14 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్​కు న్యాయస్థానం నోటీసులు
author img

By

Published : Mar 26, 2019, 9:17 PM IST

Updated : Mar 26, 2019, 10:52 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​కు న్యాయస్థానం నోటీసులు
ముఖ్యమంత్రి కేసీఆర్​కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ శ్రీనివాస్ అనే స్థానిక ఓటరు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసీఆర్ అఫిడవిట్​లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు సమర్పించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. కేసీఆర్​పై 64 కేసులు ఉంటే అఫిడవిట్​లో 4 కేసులే ఉన్నాయని తప్పుడు వివరాలు సమర్పించారని పిటిషన్​లో వెల్లడించారు. ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేసి.. తర్వాత మరొకటి దాఖలు చేశారని ఆరోపించారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రతివాదులుగా ఉన్న కేసీఆర్, ఎన్నికల కమిషన్​తో పాటు.. మరో 14 మందికి నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చూడండి: మే15 నుంచి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు!

Last Updated : Mar 26, 2019, 10:52 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.