నెలసరి కష్టాల్ని చెప్పలేం. కొందరిలో పొట్ట, నడుము నొప్పులు బాధిస్తాయి. మరి కొందరిలో వాంతులు, వికారం కూడా కనిపిస్తాయి. చికాకు, అసహనం, ఆందోళన.. ఇలా రకరకాల సమస్యలు వేధిస్తాయి. వీటినుంచి కాస్త ఉపశమనం ఎలా పొందవచ్చో చూడండి..
పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్.. పొట్టలో పట్టేసినట్లు, కండరాలు బిగిసినట్లు ఉంటే యూకలిప్టస్, పుదీనా, వింటర్‌గ్రీన్ లాంటి తైలాలను పొట్టపై రాసి మృదువుగా మర్దన చేస్తే చాలు. ఉపశమనం కలుగుతుంది. నొప్పీ తగ్గుతుంది.
పీరియడ్ పాంటీస్.. రుతుసమయంలో ఎక్కువగా రక్తం స్రావం అవుతోంటే 'పీరియడ్ పాంటీ'లను వాడితే సరి. ఇవి ఎక్కువ స్రావాన్ని పీల్చుకుని ఇబ్బంది లేకుండా చూస్తాయి.
తీపి.. ఆ సమయంలో జెల్లీతో చేసిన క్యాండీలను తింటే మనసు ప్రశాంతంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. థైరాయిడ్, మధుమేహ సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకే తినాలి.
హీటింగ్ ఫౌచెస్.. వేడి నీళ్ల సీసాను వెంటబెట్టుకుని తిరగలేం. అలాంటి వారి కోసమే ఈ హీటింగ్ పాచెస్. వీటిని నొప్పిగా, కండరాలు పట్టేసినట్లున్న చోటున అతికిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఎప్సం సాల్ట్.. నీటిలో కాస్తంత ఎప్సమ్ స్టాల్ వేసుకుని స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. ఈ ఉప్పులోని మెగ్నీషియం కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇదీ చదవండి:వ్యాయామం చేస్తున్నారా?.. ఇవి తినడం మరవకండి!