హైదరాబాద్ అంబర్‌పేటలోని నెహ్రు నగర్లో 128, 129 పోలింగ్ స్టేషన్ల పరిధిలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. తెరాస శ్రేణులు నిబంధనలకు విరుద్దంగా ప్రచారం చేస్తున్నారని కమలం కార్యకర్తలు ఆరోపించడం వల్ల మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కాషాయం పార్టీ శ్రేణులపై చేయి చేసుకున్నాడని.. భాజపా యువ మోర్చా అధ్యక్షుడు రంజిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన గిరిజనులు