అమెరికా న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో భారత సంచలనం సుమిత్ నగాల్ పోరాడి ఓడాడు. రోజర్ ఫెదరర్‌తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మొదటి సెట్ గెలిచిన సుమిత్.. తర్వాతి సెట్లలో వరుసగా పరాజయం చెందాడు.
ఫెదరర్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి సెట్లో ఫెదరర్‌కు చెమటలు పట్టించిన సుమిత్ అనంతరం రోజర్ ధాటికి తట్టుకోలేకపోయాడు. ఫెదరర్ అనుభవం, దూకుడు ముందు నిలువలేకపోయాడు.
పిన్నవయసులోనే భారత నుంచి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్మెయిన్ డ్రాకు అర్హత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు సుమిత్. యూఎస్ ఓపెన్ మొదటి సెట్లో ఫెదరర్‌పై నెగ్గిన తొలి భారత ఆటగాడిగానూ ఘనత సాధించాడు.
శుక‍్రవారం జరిగిన చివరి క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌లో నాగల్ 5-7, 6-4, 6-3 తేడాతో జోవా మెనిజెస్(బ్రెజిల్)పై గెలిచి.. యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు సుమిత్.
ఇది చదవండి: 'సాండ్ ఆర్ట్'తో సింధుకు శుభాకాంక్షలు