రాష్ట్రవ్యాప్తంగా 36 సహాయ కేంద్రాల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముందుగా స్లాట్లు బుకింగ్ చేసుకున్న అభ్యర్థులు ధ్రువపత్రాలు పరిశీలించారు. ఇవాళ్టి వరకు 48,786 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. జులై ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది