పొగాకు తాగడం వల్ల వారికే కాకుండా.. చుట్టుపక్కల వారికి కూడా ఆరోగ్యం పాడవుతుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దీనివల్ల ఆర్థికంగా వెనకబడతారని.. క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలతో కుటుంబాలకు దూరమవుతారన్నారు. పొగతాగడం హానికరమని పెట్టెలపై రాసి ఉన్నా దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ధూమపానం చేయడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా నెక్లెస్ రోడ్లో 'స్మోక్ ఫ్రీ హైదరాబాద్' పేరిట మంత్రి నడకను ప్రారంభించారు.
ఇవీ చూడండి: నల్గొండపై కేసీఆర్‌ది సవతితల్లి ప్రేమ..!: కోమటిరెడ్డి