ETV Bharat / briefs

29 జిల్లాల్లో ఘనంగా పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన

రాష్ట్రవ్యాప్తంగా తెరాస పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. ఒకే రోజు 29 చోట్ల పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి.

author img

By

Published : Jun 24, 2019, 12:40 PM IST

Updated : Jun 24, 2019, 3:34 PM IST

29 జిల్లాల్లో ఘనంగా పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన

గులాబీ అధిపతి కేసీఆర్ నిర్దేశించిన మేరకు.. రాష్ట్రమంతటా 29 జిల్లాల్లో తెరాస జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపనలు ఆడంబరంగా జరిగాయి. ముందు నిర్దేశించిన విధంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, జడ్పీ ఛైర్మన్లు భూమి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​.. సిరిసిల్ల భూమిపూజ నిర్వహించారు.

''కార్యకర్తలకు పార్టీ కార్యాలయాల్లో శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి చేయాలనేది సీఎం కేసీఆర్‌ సంకల్పం. ప్రాజెక్టుల పూర్తి వల్ల కోటి ఎకరాల మాగాణి సాధ్యం అవుతుంది. సిరిసిల్ల నియోజకవర్గానికి దసరా నాటికి గోదావరి నీళ్లు తీసుకొస్తాము. జిల్లాలో ప్రతి చెరువును నింపే బాధ్యత తీసుకుంటాము''---- కేటీఆర్

మహబూబ్​నగర్​లో మంత్రి శ్రీనివాస్​ గౌడ్, మేడ్చల్​లో మంత్రి మల్లారెడ్డి, భూమిపూజ నిర్వహించారు. సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి, కరీంనగర్​లో ఈటల రాజేందర్, నిర్మల్​లో ​అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి, నిజామాబాద్​లో​ వేముల ప్రశాంత్​ రెడ్డి, జగిత్యాలలో కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. ​జోగులాంబ గద్వాలలో సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి, జనగామ యశ్వంతాపూర్​లో ఎర్రబెల్లి దయాకర్​రావు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్​ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు.

కామారెడ్డిలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ శోభ, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జడ్పీ ఛైర్మన్‌ సుధీర్‌కుమార్‌ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి కడియం శ్రీహరి, వినయ్‌ భాస్కర్‌ హాజరయ్యారు.

సిద్దిపేట జిల్లా పొన్నాల వద్ద జడ్పీ ఛైర్‌పర్సన్‌ రోజాశర్మ భూమిపూజ నిర్వహించగా ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సతీశ్‌, ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఇదీ చూడండి:రాజధానిలో మళ్లీ కొకైన్ కలకలం

Last Updated : Jun 24, 2019, 3:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.