ఎంపీగా నంద్యాల, కర్నూలు అభివృద్ధికి ఎస్పీవై రెడ్డి చేసిన సేవలు మరవలేమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఎస్పీవై రెడ్డి మరణంపై ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారిశ్రామిక వేత్తగా, స్వచ్ఛంద సేవకునిగా చేసిన సేవలు అభినందనీయమని కీర్తించారు. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన ఎస్పీవై రెడ్డి.. నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు. ఆయన మృతి నంద్యాల ప్రాంతానికి, కర్నూలు జిల్లాకు తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు.
పవన్‌కల్యాణ్ విచారం
ఎస్పీవై రెడ్డి మరణం బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచారని గుర్తు చేసుకున్న పవన్.. రాజకీయాల్లో హుందాతనం పాటించిన నాయకుడు ఎస్పీవై రెడ్డి అని కొనియాడారు. కరవు ప్రాంతాల్లో ప్రజలకు ఎస్పీవై రెడ్డి చేసిన సేవలు మరువలేమన్నారు.
ఇవీ చూడండి : శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడేలా చేస్తాం: రాచకొండ సీపీ