పుల్వామా వంటి ఘటనల వల్ల దేశ నిఘా వ్యవస్థపై అనుమానాలు కలుగుతాయని నిపుణుడు బిక్రమ్ సింగ్ అన్నారు. ఉగ్రవాదుల వ్యూహాల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. కదులుతోన్న వాహనంపై దాడి చేయడం వల్ల వారు ఎంతటికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం అర్థమవుతోందని వెల్లడించారు.
చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకు సాగలేవు అన్నారు బిక్రమ్.
"చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకు సాగలేవు. నాకు తెలిసి ఇదే వాస్తవం. మన ప్రజలను చంపుతున్నప్పుడు పాకిస్థాన్‌తో చర్చలు జరపడంలో ఫలితం లేదు. దౌత్య సంబంధాల ప్రకారం మనమేం చెయ్యలేము. కానీ సైనిక చర్యలతో కచ్చితంగా సందేశం ఇవ్వాలి. ప్రధాని, జైట్లీ సహా ప్రభుత్వంలోని ఇతర నేతలు ఇప్పటికే ఈ ఘటనను ఖండించారు. కనుక 'ఉరీ' కన్నా పెద్ద స్థాయి సమాధానమే ఇస్తామని ఆశించొచ్చు."
--బిక్రమ్‌సింగ్, భద్రతా నిపుణుడు.
ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడితే సైన్యం రక్షణాత్మక వైఖరిని అనుసరించే అవకాశం ఉందని బిక్రమ్ వెల్లడించారు. భద్రతా బలగాల వనరులపై ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించారు.
దేశ సైనికులు ఎంతో సమర్థులని... పుల్వామా లాంటి ఘటనలకు వారు భయపడరని బిక్రమ్ ధీమా వ్యక్తం చేశారు.