ETV Bharat / briefs

'దక్షిణ కొరియాతో సంయుక్త విన్యాసాలు సరికాదు!' - america, south korea joint operations

అమెరికా-దక్షిణ కొరియా దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించనుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఉత్తరకొరియా. అణు నిరాయుధీకరణపై ఏడాది ముగిసే లోగా చర్చలకు రావాలన్న తమ అధ్యక్షుడు కిమ్​​ జోంగ్ ఉన్ ప్రతిపాదనను లెక్కచేయకుంటే అగ్రరాజ్యం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది.

అమెరికాకు ఉత్తరకొరియా హెచ్చరిక!
author img

By

Published : Nov 14, 2019, 6:49 AM IST

అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించనున్న నేపథ్యంలో అగ్రరాజ్యానికి హెచ్చరికలు జారీ చేసింది ఉత్తరకొరియా. ఇరుదేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను సంయుక్త విన్యాసాలు ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఆక్షేపించింది. అణు నిరాయుధీకరణపై ఏడాది ముగిసే లోగా చర్చలకు రావాలన్న తమ నేత కిమ్​ జోంగ్​ ఉన్​ ప్రతిపాదనను లెక్కచేయకపోతే అమెరికా అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని.. అత్యంత బాధను అనుభవిస్తారని వ్యాఖ్యానించింది.

తమను యుద్ధానికి సిద్ధం చేసే విధంగా అమెరికా కవ్వింపు చర్యలకు దిగుతోందని ఉత్తర కొరియా జాతీయ వ్యవహారాల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు 2016 లో ఈ కమిషన్​ను ఏర్పాటు చేశారు కిమ్.

అణు నిరాయుధీకరణ చర్చలపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలోనే దక్షిణ కొరియాతో అగ్రరాజ్య సంయుక్త విన్యాసాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది కిమ్​దేశం. తాము విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో.. ఇరుదేశాలకు ఆమోదమయ్యే రీతిలో ఒప్పందాన్ని రూపొందించడంపై ఒత్తిడి పెంచేందుకు ఈ ప్రకటన విడుదల చేసిందని సమాచారం. ఇందుకోసం క్షిపణి పరీక్షలనూ వేగవంతం చేసింది.

"సంయుక్త విన్యాసాలు కొరియా ద్వీపకల్పంలో ఇంతకుముందున్న రాజకీయ పరిస్థితినే.. పుఃనస్థాపించే అవకాశం ఉన్న కారణంగా అమెరికా స్వీయ నియంత్రణ పాటించాలి. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా అత్యంత ప్రమాదాన్ని.. కఠిన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది."

-ఉత్తరకొరియా ప్రకటన

ఇదీ చూడండి: 'ధిక్కరణ'పై రాహుల్​ క్షమాపణను అంగీకరిస్తుందా?

New Delhi, Nov 11 (ANI): Watching Ranveer Singh play Kapil Dev on-screen would be nothing less than a treat for fans as he proved it with his new look from '83' wherein he is acing the famous 'Natraj shot' of the cricket stalwart! After bringing out the 'Haryana Hurricane' look in July, the actor put out his look nailing the famous shot Kapil was known for. Dressed in white cricket jersey and a sweater, with gloves and knee pads on, he bears a striking resemblance with the ace cricketer. The upcoming sports film based on the former World Cup-winning captain will feature Ranveer essaying Kapil's role. The film will also feature R Badree, Hardy Sandhu, Chirag Patil, Saqib Saleem, Pankaj Tripathi, Tahir Bhasin, Ammy Virk and Sahil Khattar as the Men in Blue. Helmed by Kabir Khan, the movie is slated to release on April 10 next year.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.