నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని రాంపూర్‌లో మహాత్మ జ్యోతిభా పూలే బీసీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ప్రారంభించారు. అనంతరం నూతన పంచాయతీ భవనం, వీఆర్వో భవనం, ప్రభుత్వ వృద్ధాశ్రమంను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఎం.రామ్మోహన్రావు పాల్గొన్నారు. పేదవారికి నాణ్యమైన విద్య అందించాలని గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారని, విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి ఐఐటి, నీట్, సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షలకు సన్నద్ధం చేస్తారన్నారు.
ఇవీ చూడండి: అది నిజంగా పోలీస్ స్టేషనే..!