ETV Bharat / briefs

డిగ్రీ కళాశాలల్లో పీజీ కోర్సులను రద్దు చేయొద్దు - డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టిన పీజీ కోర్సులను రద్దు చేయరాదని

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టిన పీజీ కోర్సులను రద్దు చేయరాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్జ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు.

డిగ్రీ కళాశాలల్లో పీజీ కోర్సులను రద్దు చేయొద్దు
author img

By

Published : Jun 28, 2019, 6:29 PM IST

కాంగ్రెస్‌ హయాంలో పేద విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ పెట్టిన పీజీ కోర్సులను ఎత్తివేయరాదని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ ఏడాది నుంచి కొత్త ప్రవేశాలు లేవని పేర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని.. పేద విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో తాను ఈ లేఖ రాశానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణమే స్పందించాలని కోరారు. రకరకాల కారణాలతో కళాశాలలను మూసివేయడం సరికాదన్నారు. అదే జరిగితే విద్యార్ధులతో పాటు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని జగ్గారెడ్డి హెచ్చరించారు.

పీజీ కోర్సులను రద్దు చేయరాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్జ్ఞప్తి

కాంగ్రెస్‌ హయాంలో పేద విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ పెట్టిన పీజీ కోర్సులను ఎత్తివేయరాదని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ ఏడాది నుంచి కొత్త ప్రవేశాలు లేవని పేర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని.. పేద విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో తాను ఈ లేఖ రాశానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణమే స్పందించాలని కోరారు. రకరకాల కారణాలతో కళాశాలలను మూసివేయడం సరికాదన్నారు. అదే జరిగితే విద్యార్ధులతో పాటు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని జగ్గారెడ్డి హెచ్చరించారు.

ఇదీ చూడండి : అంగన్​వాడీలో సబ్ కలెక్టర్ కుమార్తె

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.