బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన చిత్రం 'కూలీ నెంబర్ 1'. 1995లో అదే టైటిల్‌తో వచ్చిన సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిందీ సినిమా. అందులో గోవింద, కరిష్మా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. రెండు చిత్రాలకూ వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈ సినిమాపై స్పందించిన దర్శకుడు డేవిడ్ ధావన్.. తన తనయుడు హీరోగా ముద్దు సన్నివేశం చిత్రీకరించిన సందర్భాన్ని పంచుకున్నారు. ఓ దర్శకుడిలా వృత్తికే మొదట ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"వరుణ్‌తో ముద్దు సన్నివేశం తెరకెక్కించడం కష్టంగా అనిపించలేదు. ఇలాంటి సీన్లు చిత్రీకరించడంలో తప్పు ఏముంది?. కథలో ఈ సన్నివేశం ముఖ్యమనిపిస్తే తప్పకుండా చేయాల్సిందే. నటిస్తున్నది తనయుడు అయినంత మాత్రాన సిగ్గు పడాల్సిన పనిలేదు."
- డేవిడ్ ధావన్, దర్శకుడు
షూటింగ్ సమయంలో 'వరుణ్ ఈ సీన్ చేద్దామా? వద్దా?' అని తాను అడిగే వాడిని కాదని.. ఓ డైరెక్టర్లాగే 'ఈ సీన్ చేయబోతున్నాం' అని చెప్పేవాడినని డేవిడ్ అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి:విభిన్న కథతో నితిన్ 'చెక్'.. మళ్లీ ఆ దర్శకుడితో సత్యదేవ్