'వాయు' తుపాను గుజరాత్ తీరాన్ని తాకదని వాతావరణశాఖ ప్రకటించింది. తుపాను దిశ మారి... పశ్చిమం వైపు ప్రయాణిస్తోందని స్పష్టం చేసింది. కానీ తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని, అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి గంటకు 160 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.
తొలుత 'వాయు' తుపాను గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని వెరావల్, ద్వారక మధ్య తీరాన్ని దాటనుందని భావించారు. కానీ ఇప్పుడు గుజరాత్ తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తోందని వెల్లడించింది వాతావరణ శాఖ.
తుపాను దృష్ట్యా గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సుమారు మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
ఇదీ చూడండి:- WC19: వరల్డ్కప్ గెలిచేది.. వరుణుడంటా..!