ETV Bharat / briefs

2.9కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం హ్యాక్​! - personal data laeked

సైబర్​ నేరగాళ్లు.. భారత్​లోని 2.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకింగ్​ ఫోరంలో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు ప్రముఖ ఆన్​లైన్ నిఘా సంస్థ తెలిపింది. వీరంతా ఉద్యోగాల అన్వేషణలో ఉన్నవారేనని పేర్కొంది.

Cyber criminals leak personal data of 2.9 cr Indians
2.9 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు హ్యాక్​!
author img

By

Published : May 23, 2020, 10:34 AM IST

Updated : May 23, 2020, 11:37 AM IST

ఉద్యోగ అన్వేషణలో ఉన్న 2.9కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించినట్టు ఆన్​లైన్​ నిఘా సంస్థ సైబిల్ వెల్లడించింది. వారి వివరాలను సైబర్ నేరగాళ్లు డార్క్​వెబ్​లోని హ్యాకింగ్​ ఫోరంలో పోస్ట్ చేశారని తెలిపింది.

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్, అమెరికాకు చెందిన సీక్వోయా నిధులతో పనిచేసే భారతీయ విద్యా సాంకేతిక సంస్థ అన్​అకాడెమీ కూడా హ్యాకింగ్‌ బారిన పడినట్లు ఇటీవలే వెల్లడించింది సైబిల్.

హ్యాకింగ్ జరగడం సాధారణమేననీ, ఈసారి మాత్రం కీలక వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు సేకరించారని బ్లాగ్​లో సైబిల్ పేర్కొంది. విద్యార్హత, చిరునామా, మెబైల్​ నంబర్​, ఈ-మెయిల్, సహా మరిన్ని వివరాలను సైబర్ నేరగాళ్లు అపహరించారని పేర్కొంది. ప్రముఖ జాబ్ వెబ్​సైట్​ పేరుతో ఫోల్డర్​లో హ్యాకర్లు డేటా పోస్ట్​ చేశారని నివేదికలో పేర్కొంది.

అయితే సైబర్ నేరగాళ్లు ఈ వివరాలను ఎక్కడి నుంచి అపహరించారనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సైబిల్ వివరించింది. రెస్యూమ్​ అగ్రిగేటర్ల నుంచే సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించి ఉంటారని అంచనా వేస్తున్నట్టు వివరించింది.

ఆన్​లైన్ నేరాలకు పాల్పడేందుకు నకిలీ గుర్తింపు కోసం హ్యాకర్లు ఎల్లవేళలా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తుంటారని ప్రకటనలో తెలిపింది సైబిల్.

Last Updated : May 23, 2020, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.