బీమా సంస్థలో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయంటూ నమ్మించి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్ఎం.ఆరీఫ్‌ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఏడాదిన్నర వ్యవధిలో రూ.44 లక్షలకు పైగా స్వాహా చేసి ప్లేటు ఫిరాయించారు. మోసపోయానని గమనించిన ఆరిఫ్... సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు... నోయిడాలోని ఐటీ సొల్యూషన్స్ కంపెనీకి చెందిన సునీల్ గుప్త, రాజ్హన్స్ను నిందితులుగా గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఓ వ్యక్తి ఫోన్ చేసి బీమా కంపెనీలో పెట్టుబడి పెట్టాలని కోరగా... 5లక్షలు పెట్టుబడి పెట్టారు. వడ్డీని పెట్టుబడిలో కలిపామంటూ ఆరీఫ్‌ను నమ్మించారు. ఏడాదిన్నర వ్యవధిలో 20మందికి పైగా తనతో మాట్లాడి బీమా సంస్థలో లాభాల గురించి వివరించటం వల్లే నమ్మి పెట్టుబడి పెట్టినట్లు పోలీసులకు ఆరీఫ్ వివరించారు. ఇలా పలు దఫాల్లో రూ. 44 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: భట్టి దీక్షతో బయటపడ్డ విభేదాలు