కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. రూ. 9 వేల రూపాయలను పింఛనుగా అందిస్తామని ప్రకటించింది. సీపీఐ ఎన్నికల ప్రణాళిక లోని మరికొన్ని అంశాలు...
⦁ దిల్లీ, పుదుచ్చేరి రాష్ట్రాలకు పూర్తిస్థాయి రాష్ట్రహోదా
⦁ రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ
⦁ వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం
⦁ ఉపాధి హామీ పనిదినాల్ని 200కు పెంపు
⦁ వ్యవసాయ కూలీలకు కనీస వేతనం
⦁ సైన్యానికి ఒకే ర్యాంకు ఒకే పెన్షన్
⦁ పీడీఎస్ పథకాన్ని అందరికీ వర్తింపజేయడం
⦁ ఆరోగ్య రంగానికి జీడీపీలో 6శాతం వాటా
⦁ ఎన్నికల కమిషన్, కాగ్, సీబీఐ, ఆర్బీఐ, సీవీసీలకు స్వతంత్ర ప్రతిపత్తి
ఎన్నికల ప్రణాళిక విడుదల సందర్భంగా అధికార భాజపాపై విరుచుకుపడ్డారు సీపీఐ నేత డి.రాజా. మోదీ ప్రభుత్వం వ్యవస్థలపై దాడులు చేస్తోందన్నారు. మోదీ విదేశాంగ విధానం విఫల ప్రయోగమని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి:లండన్ కోర్టులో నీరవ్‌కు రెండోసారి భంగపాటు