ETV Bharat / briefs

దేశీయ వ్యాక్సిన్ల పురోగతిపై కేంద్ర బృందం ఆరా

author img

By

Published : Aug 18, 2020, 5:16 AM IST

Updated : Aug 18, 2020, 5:42 AM IST

ప్రముఖ దేశీయ టీకా ఉత్పత్తిదారులతో జాతీయ నిపుణుల బృందం వేర్వేరుగా భేటీ అయింది. ఆయా సంస్థలు రూపొందిస్తోన్న వ్యాక్సిన్ల పురోగతిపై ఆరా తీసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

VIRUS-VACCINE
కరోనా వ్యాక్సిన్​

కరోనా వ్యాక్సిన్​కు సంబంధించి ప్రముఖ దేశీయ టీకా ఉత్పత్తిదారులతో జాతీయ నిపుణుల బృందం సమావేశమైంది. ఆయా సంస్థలు తయారుచేస్తోన్న వ్యాక్సిన్లు ఏయో దశల్లో ఉన్నాయో వివరాలు సేకరించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

"సమావేశం పరస్పర ప్రయోజనకరంగా సాగింది. వారు తయారు చేస్తోన్న వ్యాక్సిన్ల పురోగతిపై వివరాలు సేకరించాం. ప్రభుత్వంపై వాళ్లు పెట్టుకున్న అంచనాలను తెలుసుకున్నాం."

- కేంద్ర ఆరోగ్య శాఖ

సీరమ్​ ఇనిస్టిట్యూట్ (పుణె), భారత్​ బయోటెక్ (హైదరాబాద్)​, జైడస్ కాడిలా (అహ్మదాబాద్), జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ (పుణె), బయోలాజికల్- ఈ (హైదరాబాద్​) ప్రతినిధులతో ఈ భేటీ నిర్వహించారు. నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ నేతృత్వంలోని ప్రభుత్వ బృందం వీరితో వేర్వేరుగా సమావేశమైంది.

ఫార్మా కంపెనీలతో ఈ బృందం మొదట ఆగస్టు 12న సమావేశమైంది. ఈ భేటీలో వ్యాక్సిన్ వితరణ యంత్రాంగంపై చర్చించింది. ప్రజలకు వ్యాక్సిన్​ సరఫరా చేసేందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పనపై సమాలోచనలు చేసింది. వ్యాక్సిన్​ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ఆర్థిక అంశాలపైనా చర్చించారు.

వివిధ వ్యాక్సిన్ల పురోగతి ఇలా..

  • ఐసీఎంఆర్, జైడస్ కాడిలా​ భాగస్వామ్యంలో భారత్​ బయోటెక్​ తయారు చేస్తోన్న రెండు వ్యాక్సిన్లు మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్నాయి.
  • ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​ను ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో సీరమ్​ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తికి అనుమతులు పొందింది. వీటికి సంబంధించి ఫేజ్​-2, 3 ట్రయల్స్​ను భారత్​లో త్వరలో ప్రారంభించనుంది.
  • 'జాన్సన్​ అండ్ జాన్సన్​' అభివృద్ధి చేసే టీకా ఉత్పత్తికి 'బయోలాజికల్-​ ఈ' ఒప్పందం కుదుర్చుకుంది.
  • అమెరికాకు చెందిన హెచ్​డీటీ బయోటెక్​ కార్పొరేషన్​ సహకారంతో ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్​(హెచ్​జీసీఓ19)ను జెన్నోవా అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించి ఈ ఏడాది చివర్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: టీకా​ తయారీ ఆషామాషీ కాదు.. సవాళ్లు ఎన్నో!

Last Updated : Aug 18, 2020, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.