ETV Bharat / briefs

సీఎల్పీ విలీనాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ - భట్టి విక్రమార్క

తెరాసలో సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ న్యాయపోరాటం ప్రారంభించింది. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం... మంగళవారం విచారించనుంది.

సీఎల్పీ విలీనాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌
author img

By

Published : Jun 10, 2019, 7:15 PM IST

సీఎల్పీ విలీనాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌

సీఎల్పీని రాజ్యంగ విరుద్ధంగా తెరాస శాసనసభ పక్షంలో విలీనం చేశారంటూ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. విలీనం చేస్తూ జారీ చేసిన బులెటిన్​ను కొట్టివేయాలని కోరుతూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క పిటిషన్ దాఖలు చేశారు. పార్టీలు, శాసనసభ పక్షాల విలీనం ఎన్నికల కమిషన్ పరిధిలోనిదని... స్పీకర్​కు సంబంధం లేదని పిటిషన్​లో పేర్కొన్నారు.

తెలంగాణ శాసనసభాపతి తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని ఆరోపించారు. ఒకవేళ విలీనం చేస్తే ముందుగా తమకు నోటీసు ఇవ్వాలని కోరినప్పటికీ... స్పీకర్ పట్టించుకోలేదన్నారు. విలీనాన్ని అడ్డుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్​లో ఉందన్నారు. తెరాసఎల్పీలో సీఎల్పీ విలీనం కాబోతున్నదని ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, రేగా కాంతారావు మీడియా సమావేశంలో ముందుగానే చెప్పారని... దానిని బట్టి తెరాస, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముందుగానే ప్రణాళిక చేసినట్లు తెలుస్తోందని పిటిషన్​లో పేర్కొన్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చర్యలు తీసుకోవాలన్న తమ పిటిషన్లు స్పీకర్ వద్ద ఇప్పటికీ పెండింగ్​లో ఉన్నాయన్నారు. అనర్హత పిటిషన్లను వీలైనంత త్వరగా తేల్చాలని స్పీకర్​ను ఆదేశించాలని హైకోర్టును భట్టి, ఉత్తమ్ కోరారు. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్, పన్నెండు మంది ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇవాళ అత్యవసరంగా విచారణ జరపాలని కాంగ్రెస్ తరఫు న్యాయవాది కోరారు. తెరాసలో కాంగ్రెస్ ఎమ్మెల్సీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంతో కలిపి రేపు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

ఇదీ చూడండి: 'బర్త్​డే అయితే నాకు వయసు తగ్గుతుంది'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.