ETV Bharat / briefs

'మద్దతు ధరకు వ్యూహం రూపొందించండి' - cm kcr review on agriculture

రైతులకు కనీస మద్దతు ధర కల్పనపై సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

'మద్దతు ధరకు వ్యూహం రూపొందించండి'
author img

By

Published : Apr 16, 2019, 10:24 PM IST

Updated : Apr 17, 2019, 7:21 AM IST

పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహం రూపొందించేందుకు ప్రగతి భవన్​లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

'మద్దతు ధరకు వ్యూహం రూపొందించండి'

సాగును లాభసాటిగా చేయాలి

వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి... రైతులకు కనీస మద్దతు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం సూచించారు. ఇందుకోసం రానున్న పది రోజుల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పంటకాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఐదు నిమిషాల్లోనే చెక్కు ఇచ్చే పద్ధతి రావాలి

రైతులు పండించిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా ప్రభుత్వ విధానం ఉండాలని... అన్నదాతల నుంచి నేరుగా మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లు జరపాలని కేసీఆర్ పేర్కొన్నారు. రైతులు పండించిన పంట మార్కెట్​లో కాంటా అయిన ఐదు నిమిషాల్లోనే చెక్కు ఇచ్చే పద్ధతి రావాలని ఆకాంక్షించారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి రావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎవరూ సరుకులు కొనకుండా చూడాలని ఆదేశించారు.

మహిళా సంఘాలకు అప్పజెప్పండి

మేలురకమైన పత్తి సాగు విధానాలు ప్రపంచంలో ఎక్కడున్నా... అధ్యయనం చేసి అనుసరించాలని కేసీఆర్ తెలిపారు. మొక్కజొన్నకు మంచి విత్తనాలు తయారు చేయాలని... చింతపండు కొరత ఉన్నందున విరివిగా చింతచెట్లు పెంచాలని సూచించారు. హరితహారం కింద కనీసం 5 కోట్ల చింత మొక్కలను ఉచితంగా సరఫరా చేయాలని అన్నారు. పసుపు, కారం, కందిపప్పు, స్వచ్ఛమైన పల్లినూనె, నువ్వుల నూనె తయారీ మహిళా సంఘాల ద్వారా చేయించాలని తెలిపారు. కల్తీ సరుకులు కొనే బాధ వినియోగదారులకు తప్పుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

అలాంటి వాటిని ప్రోత్సహించండి

నగరాల్లో నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలను చుట్టుపక్కలున్న గ్రామాల్లో పండించాలని సూచించారు. అంకాపూర్ రైతుల్లా ఏ పంటకు ఎక్కడ మంచి మార్కెట్ ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా పంటలకు ధర రాబట్టుకోవాలని తెలిపారు. తెలంగాణ సోనా రకం బియ్యం మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుంతుందని వైద్యులు చెబుతున్నారని... అలాంటి ఆహార పదార్థాలను ప్రోత్సహించాలని సూచించారు.

ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పండ్ల సాగుకు రాష్ట్రంలో ఏ ప్రాంతం అనువైనదో గుర్తించి సాగు చేయించాలని చెప్పారు.

Intro:Body:Conclusion:
Last Updated : Apr 17, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.